![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -193 లో.. కావ్యని బాగా చూసుకోమని రాజ్ తో సీతారామయ్య చెప్తాడు. సీతారామయ్య సంతోషం కోసం కావ్యని బాగా చూసుకుంటానని రాజ్ అబద్ధం చెప్తాడు. సరే పదా హాల్లోకి వెళదామని సీతారామయ్య వెళతాడు. నువ్వు వెళ్లి కావ్యని తీసుకొని వచ్చి ఆమెని ఆశీర్వదించు, అప్పుడే వ్రతం పూర్తవుతుందని సీతారామయ్య అనగానే.. సరే అని కావ్యని తీసుకురావడానికి రాజ్ వెళ్తాడు.
రాజ్ అలా వెళ్లగానే అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా అపర్ణ ఆశ్చర్యంగా చూస్తుంది. రాజ్ కావ్య దగ్గరికి వెళ్లేసరికి.. కావ్య పుట్టింటికి వెళ్లడానికి బ్యాగ్ సర్దుకొని ఎదరుపడుతుంది. వెళ్తున్న అని రాజ్ కి చెప్పి గదిలో నుండి బయటకు వెళ్లబోతుంటే రాజ్ ఆగమని చెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండమని రాజ్ అనగానే.. ఎందుకు ఒక వస్తువుగానా? ఎందుకు ఉండాలి? ఎలా ఉండాలని కావ్య అడుగుతుంది. ఇన్ని రోజులు ఎదరుచూసిన దానివి, ఒక మూడు నెలలు ఎదురు చూడలేవా అని రాజ్ అంటాడు. ఈ మూడు నెలల తర్వాత నన్ను భార్యగా ఒప్పుకుంటారా అని కావ్య అడుగుతుంది. అన్నిటికి ఈ మూడు నెలల్లో సమాధానం దొరుకుతుందని రాజ్ అంటాడు. నమ్మకం లేదని కావ్య అనగానే నీకు నమ్మకం కలగాలి అంతేకదా అని రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని హాల్లోకి వెళ్తాడు. ఆ తర్వాత సీతరామయ్య కావ్యని ఆశీర్వాదం తీసుకొమని చెప్పగానే కావ్య రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు సీతారామయ్య, ఇందిరాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అపర్ణ మాత్రం కోపంగా చూస్తుంటుంది.
ఆ తర్వాత అపర్ణ ఒంటరిగా ఆలోచిస్తుండగా రుద్రాణి కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాను రాను నీకు ఈ ఇంట్లో విలువ లేకుండా పోయింది, రాజ్ నీ మాట వినట్లేదు అన్నట్లుగా రుద్రాణి మాట్లాడగనే.. అపర్ణ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు కృష్ణుడితో తన సంతోషాన్ని చెప్పుకుంటుంది కావ్య. నా భర్త ఇంకో మూడు నెలలు టైం కావాలని అడిగాడంటే నన్ను భార్యగా ఒప్పుకుంటాడా? అంత నీ మాయంటూ దేవుడికి కావ్య మొక్కుకుంటుంది. మరొక వైపు రాజ్ కృష్ణుడు దగ్గరికి వచ్చి.. మా తాతయ్య కోసం మాత్రమే కావ్యని హ్యాపీగా చూసుకుంటానని మాటిచ్ఛాను. అంత నీ మాయ కృష్ణ అని రాజ్ మొక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |